పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్. డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. పోటీగా.. గ్యాస్ కూడా ఆగనంటోంది. ఇలాంటి తరుణంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. బైకులు, కార్లను బయటికి తీస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వారి ఆలోచనలు మారుతున్నాయి. కొందరైతే.. ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సరికొత్తగా ముందుకు పోతోంది. విజయవాడలో.. ఆటోలను ఎలక్ట్రిక్ గా మార్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 ఆటోలను ప్రయోగాత్మకంగా ఎంపిక…
బెజవాడ అరండల్‌పేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రాఖీ పండగనాడు తమ్ముడికి రాఖీ కట్టి వెళ్లిన ఆమె ఆ తర్వాత రెండు గంటలకే చనిపోయినట్టు కబురందింది. అయితే అత్తింటివారే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు ఉష, ఫణి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే..! ఉష ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అన్నీ సర్దుకున్నాయ్ అన్న సమయంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయన్నది ఆమె తల్లిదండ్రుల…
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను అరెస్ట్ చేసారు. అతడిని బెంగుళూరులో అరెస్ట్ చేసారు విజయవాడ పోలీసులు. రాహుల్ హత్య కేసులో ఏ2 గా ఉన్నాడు కోగంటి.…
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్‌ను హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్ కుమార్…
విజయవాడలో యువతి మృతి కలకలం రేపుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె ముఖంపై గాయాలుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రసేన్ కు.. సింధుకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ.. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రసేన్ ఇంట్లోనే ఆమె ఉంటోంది. సింధు అనుమానాస్పద స్థితిలో…
రాహుల్ హత్యకేసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఐదుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విజయవాడ పోలీసులు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుల పై 302, 120 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎ1: కోరాడ విజయ్‌కుమార్, ఏ2: కోగంటి సత్యం, ఏ3: పద్మజ, ఏ4: పద్మజ, ఏ5: గాయత్రీల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. జిక్సిన్ సిలిండర్ల కంపెనీ వ్యవహారంలోనే వివాదాలు తలెత్తినట్లు…
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
విజయవాడ : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు భక్తులు. అటు వరలక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతోషంగా ఉందంటున్నారు. ఇక అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు ఆలయ సిబ్బంది. శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇక…
విజయవాడలో అతిపెద్ద కాంచీపురం గౌరి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం బుధవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిల్క్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిశుడు) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు ఓకే ఒక వేదిక కాంచీపురం గౌరి సిల్క్స్ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన విలక్షణమైన కంచి…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి… దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్ద ప్రసాదాలు అందించారు. కిషన్ రెడ్డి తో పాటు దుర్గమ్మను దర్శించుకున్నారు సోమూవీర్రాజు, మాధవ్. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించాక తెలుగు…