విజయవాడ నుంచి ప్రత్యేక టూరిస్ట్ రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మొదటి టూర్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుందని, 31తో ముగుస్తుందన్నారు. టూర్‌లో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాట్యూ ఆఫ్ యూనీటి సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయన్నారు.
Also Read:ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎంఎం నరవాణే నియామకం
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ఒక వ్యక్తికి స్లీపర్ క్లాస్ కి 10400, కంఫర్ట్ కి 17,330 రూపాయల కాస్ట్ అవుతుందన్నారు. దీంతో పాటు ఆగ్రా, అమృత్‌సర్, హరిద్వార్, వాఘా బార్డర్, గోవా, హంపి ఇలా అనేక టూరిస్ట్ ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు. స్టే నుండి ఫుడ్ వరకు అన్ని రైల్వేశాఖ అందజేస్తుందన్నారు. ఒక్కో రైళ్లలో 500 నుండి 600 వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే దక్షిణ భారత యాత్ర సక్సెస్‌పుల్‌గా కొనసాగిందని పేర్కొన్నారు.
కరోనా నిబంధనల పాటిస్తూనే ఐఆర్‌టీసీ యాత్ర సదుపాయాలను కల్పిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల టూర్ ప్యాకెజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రూ. 3000 ధరతో టూర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తిరుపతి దర్శనం కూడా ట్రైన్ టూర్ ప్యాకేజ్ ద్వారా సులువుగా అవ్వడమే గాక త్వరగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. 3,220 రూపాయలకు విజయవాడ నుండి తిరుపతి దర్శనం వరకు ఇబ్బంది లేకుండా చేయించనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ టూర్స్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని, Irctc వెబ్ సైట్ లో ప్యాకేజ్ డీటెయిల్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చని కిషోర్ తెలిపారు.
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!