విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్ అయోమయంలో పడుతోందట.. బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న…
బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న…
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
నేడు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అయితే రేపు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల…
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గానికి జరగిన ఉప ఎన్నిక తరువాత జనసేన పార్టీ సైలెంట్ అయింది. కరోనా నిబంధనలు ఎత్తివేస్తుండటంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నేతలతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజయవాడలో పర్యటించబోతున్నారు. విజయవాడలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, రాష్ట్రంలో ప్రజలు…
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు..…
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం తెలిపింది కోర్టు.. ఎస్బీఐ వేలంలో 1401 చదరపు గజాల భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకోగా.. అగ్రిగోల్డ్ కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ.. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని పేర్కొంది సీఐడీ.. అయితే, వాస్తవ ధర…
పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,100 ఉండగా.. 24…
కోవిడ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి.. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించాయి.. వాళ్లకు ఇరత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. పరీక్షలు వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి…