కాసేపటి క్రితమే…. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ… నిబంధనలు అందరూ పాటిస్తే కరోనా తగ్గిపోతుందని…. ఆలయ భూములు…
బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని…
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి…
సరుకు రవాణ చేసే గూడ్స్ రైళ్లు మహా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి. ఇండియన్ రైల్వేలకు సరుకు రవాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్లను నడపడం వలన ప్రజా రవాణా రైళ్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజన్లతో కూడిన త్రిశూల్ రైలును తయారు చేసింది. ఇది పూర్తిగా…
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్సైట్లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్…
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఇంద్రకీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దం…
బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని…
విజయవాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు. అయితే పార్టీలోని అంతర్గత గొడవలతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయర్ సీటు విషయంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సందర్భంగా నాని చేసిన…