Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం.. సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. సీఎం జగన్‌పై దాడి కేసులో సతీష్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
MP YS Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఉన్న పాత కేసును కొట్టివేసింది విజయవాడ కోర్టు.. ఎంపీ అవినాస్‌రెడ్డి సహా పలువురిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టివేసింది.. అయితే, తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట 2015లో ధర్నా చేస్తే.. అప్పట్లో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సహా 94 మందిపై కేసులు పెట్టారు.. ఇక, ఈ రోజు విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి.. విచారణ…
విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు…
గృహహింస కేసులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.…