MP YS Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఉన్న పాత కేసును కొట్టివేసింది విజయవాడ కోర్టు.. ఎంపీ అవినాస్‌రెడ్డి సహా పలువురిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టివేసింది.. అయితే, తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట 2015లో ధర్నా చేస్తే.. అప్పట్లో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సహా 94 మందిపై కేసులు పెట్టారు.. ఇక, ఈ రోజు విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి.. విచారణ జరిపి సాక్ష్యాలు లేని కారణంగా కేసును కొట్టేస్తు నేడు తీర్పు వెలువరించింది న్యాయస్థానం..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
2015 మేలో తొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన కేసులో అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి తో పాటు 94 మందిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఇవాళ విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి.. పులివెందుల నుంచి అవినాష్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు విజయవాడకు రాగా.. చంచలగూడ జైలు నుంచి విజయవాడ కోర్టు ముందు హాజరయ్యారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. మొత్తంగా ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. సాక్ష్యాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.