దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. ఆర్థిక నేరగాళ్లంతా ఒక చోట చేరి ఫుల్‌ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశానికి వెన్నుపోటు పొడిచి.. కోట్లలో ఎగనామం పెట్టేసి విదేశాల్లో మాత్రం జల్సాలు అనుభవిస్తున్నారు.
ఆర్‌సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో దొంగ దొరికాడురా అంటూ సోషల్ మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. అతడు చేసిన పోస్టును ట్రోలింగ్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా…
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు…
Vijay Mallya Gali Janardhan Reddy Roles in Bharateeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా ఎట్టకేలకు జూలై 12వ తేదీ అంటే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96 లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి…
Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ.180 కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు విజయ్ మాల్యాపై ఉన్న కేసుకు సంబంధించి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది.
Vijay Mallya Tweets Ahead of RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌పై అందరి కళ్లు…
ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో పాటు విజయ్ మాల్యాలను భారత్‌కు తీసుకురావడానికి భారత దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి.
కోర్టు ధిక్కార నేరం కింద పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ 40 మిలియన్ల అమెరికన్ డాలర్లను విజయ్ మాల్యా తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 9వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా విదేశాల్లో ఉన్న ‘డియాజియో’ కంపెనీ బ్యాంకు…