దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. ఆర్థిక నేరగాళ్లంతా ఒక చోట చేరి ఫుల్‌ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశానికి వెన్నుపోటు పొడిచి.. కోట్లలో ఎగనామం పెట్టేసి విదేశాల్లో మాత్రం జల్సాలు అనుభవిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరు కోసం అనుకుంటున్నారు. అదేనండీ.. భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ గురించి. ప్రస్తుతం యూకేలో విలాసవంతంగా గడుపుతున్నారు. ఇక వీళ్లిద్దరూ ఒక పార్టీల్లో కలుసుకుని ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఒక పాట కూడా పాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ravindra Jadeja: రవీంద్ర జడేజా చరిత్ర.. ప్రపంచంలోనే ‘ఒకే ఒక్కడు’!
లండన్‌లో వారాంతంలో ఒక విలాసవంతమైన ప్రైవేటుు పార్టీ జరిగింది. పెద్ద పెద్ద అతిథులంతా హాజరయ్యారు. ఇక లలిత్ మోడీ మైక్ అందుకుని పాట పాడడం ప్రారంభించగా.. అంతలో విజయ్ మాల్యా కూడా మరొక మైక్ అందుకుని జత కలిశారు. ఇద్దరూ కలిసి పాప్ సింగర్‌ల్లా చెలరేగిపోయి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను లలిత్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ పార్టీ లలిత మోడీ ఇంట్లోనే జరిగినట్లు సమాచారం. 310 మందికి పైగా స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. ఇక అతిథులతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు. అందమైన సాయంత్రానికి ధన్యవాదాలు అంటూ ట్యాగ్ చేశారు.
ఇది కూడా చదవండి: Gaza: అమెరికా భద్రతా దళాలు ఘాతుకం.. గాజా శరణార్థులపై కాల్పులు.. 118 మంది మృతి!
లలిత్ మోడీ, విజయ్ మాల్యా భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి లండన్ పారిపోయారు. లండన్ నుంచి రప్పించేందుకు ఈడీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తనపై రాజకీయ ప్రేరణతోనే కేసులు మోపబడ్డాయని లలిత్ మోడీ పేర్కొ్న్నారు. ఇక మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయారు. అప్పటినుంచి లండన్‌లోనే నివాసం ఉంటున్నాడు.