Vijay Mallya Gali Janardhan Reddy Roles in Bharateeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా ఎట్టకేలకు జూలై 12వ తేదీ అంటే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96 లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన అయితే లభిస్తుంది. అయితే సినిమాలో ప్రస్తావించిన ఇద్దరి గురించి ఇప్పుడు ఫ్యాన్ ఇండియా వైడ్ చర్చ జరుగుతుంది.
Bharateeyudu 3: అసలు మ్యాటర్ అక్కడే ఉంది.. దాచాం లోపల!
అదేంటంటే సినిమాలో ఒక మహారాష్ట్ర వ్యాపారి 12 వేల కోట్లు బ్యాంకు లోన్స్ ఎగ్గొట్టి తైపే అనే తైవాన్ కి చెందిన ఒక ప్రాంతానికి పారిపోయి అక్కడ విలాసంగా అమ్మాయిలతో గడుపుతున్నట్టు చూపించాటారు. అలాగే గుజరాత్ కి చెందిన ఒక మైన్స్ వ్యాపారి 10 ఏళ్లలోనే వందల మైన్స్ సంపాదించి, గోల్డెన్ బాత్రూంలో తన కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్లు చూపించారు. ఇందులో మొదటి మహారాష్ట్ర వ్యాపారి పాత్రను విజయ్ మాల్యాను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది. అలాగే కాలకృత్యాలు తీర్చుకునే వ్యక్తి పాత్రను మైన్స్ కింగ్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డిని చూసి స్ఫూర్తి పొంది ఆయన ఆధారంగానే రెడీ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చూసిన వారు ఎవరైనా ఉంటే ఈ విషయంలో మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి.