Vijay Mallya Tweet On RCB: భారత్ లోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను నెటిజన్స్ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను విజయ్ మాల్యా నెట్టింట అభినందనలు తెలిపారు.
Read Also: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
ఇక, ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో దొంగ దొరికాడురా అంటూ సోషల్ మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. అతడు చేసిన పోస్టును ట్రోలింగ్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి రావాలని సూచించారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు సరదాగా భారత్ కి రావచ్చుగా.. అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. భారత్‌లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు పోస్ట్ చేశారు. ‘కమ్ బ్యాక్ టూ ఇండియా మ్యాన్’.. “ఎప్పుడు వస్తున్నావు?”.. అని ఇలా మరికొందరు నెటిజన్స్ కామెంట్లు చేశారు.
Read Also: Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు
కాగా, ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరు సంపాదించుకున్న విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో మొత్తం దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు సుమారు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ కేసుల్లో తీవ్ర ఆరోపణలతో 2016లో భారతదేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్న విజయ్ మాల్యాను.. భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం కొనసాగుతుంది.
Congratulations to RCB for pulling off a phenomenal win over LSG tonight and setting a IPL record of away wins. Hopefully, strong momentum and return of key players will enable RCB to play bold en route to the IPL Trophy.
— Vijay Mallya (@TheVijayMallya) May 27, 2025