జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN -1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN - 1 మహమ్మారి కట్టడి పై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి…
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు.
ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల అన్నారు. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా.. మిల్లులు సహకరించకున్నా.. తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి అంటూ ఆయన పేర్కొన్నారు.
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Kanti Velugu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సోమవారం నుంచి పదిరోజుల పాటు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు.