ఏపీ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వాక్రా మహిళల ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయించే అంశంపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది.
Uttam Kumar Reddy: పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ జల సౌదలో రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది.
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్‌టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వారికి దిశానిర్దేశం చేశారు.. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం.. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అన్నారు