Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తుఫాన్ సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయం పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.. నిత్యావసర వస్తువులు నగదు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి.. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది..…
కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు చంద్రబాబు.. సీఎం అంటే కామన్ మెన్ అని నేను చెబుతున్నా.. మీరు కూడా అలాగే పని చేయాలని సూచించారు.. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు.. కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి.. అన్నింటికీ రూల్స్ అనొద్దన్నారు..
యూరియా కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యూరియాను తక్షణ పంట అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలి.. వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు యూరియా వినియోగిస్తే కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు..
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు.
Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు.
విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.
ప్రజలను పదేపదే కార్యాలయాలకు తిప్పుకోవద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి ఆదేశించారు.
Mallu Bhatti Vikramarka: విద్యుత్ శాఖ అధికారులు పనితీరు బాగుందంటూ ప్రశంసించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.