Covid Cases Rise: దేశంలో మళ్లీ కరోనా కలవరం.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. కరోనా కేసులు ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో రెండు వేలకు చేరవవుతున్నాయి.
Also Read:MLC Kavitha : కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
కొవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేంద్ర అప్రమత్తమైంది. ఇవాళ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలతో చర్చించనుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
Also Read:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల
ఇప్పటికే కరోనా విజృంభనపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. రంజాన్ పండుగ తో పాటు, ఇతరత్రా పండుగలు కూడా వస్తున్నవేళ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
దాదాపు ఏడాది పాటు కరోనా కేసులు పెరగలేదు. మహమ్మారి అదుపులోకి వచ్చింది. దేశవ్యా్ప్తంగా కేవలం పదుల సంఖ్యలోనే కేసులు నమోదు అయ్యాయి. అయితే, గత రెండు నెలలుగా కేసుల్లో పెరుదల కనిపిస్తోంది. ప్రజలంతా మళ్ళీ సాధారణ జీవనానికి అలవాటు పడిన సమయంలో మళ్ళీ తన పంజా విసురుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
Also Read:Harrassed : బండిపై వెళ్తున్న యువతిని కొట్టిన యువకులు.. మద్యంమత్తులో వీరంగం..
కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇప్పుడు ఇన్ ఫ్లూయెంజా వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రజల రద్దీని నియంత్రించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలి మరియు కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!