CM YS Jagan: మరో రెండు రోజుల్లో 2023లో గుడ్‌బై చెప్పబోతున్నాం.. 2024 ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, 2024లో ఆదిలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా జరగనున్నాయి. దీంతో ఎన్నికల ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.. జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గననున్నారు సీఎం వైఎస్ జగన్.. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.
Read Also: Praja Palana Applications 2023: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన అప్లికేషన్లు ప్రారంభం
మరోవైపు.. ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు.. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పర్యటన కోసం.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.