దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ ఈరోజు దేశంలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. దేశంలో థర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ పైకూడా ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఆయన…
ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత…
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…
ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస,…