Pendem Dora Babu: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.
Read Also: Minister Adimulapu: సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.
ఈసారి పిఠాపురం సీటు పెండెం దొరబాబుకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. పిఠాపురం ఎమ్మెల్యే సీటు వేరే అభ్యర్థికి ఇవ్వాలని సీఎం స్పష్టం చేయడంతో.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దొరబాబు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో.. గత వారం నుంచి తన నియోజకవర్గంలో సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు దొరబాబు. అంతేకాకుండా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా దొరబాబు పాల్గొనడం లేదు. అయితే ఈ అంశంపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరగుతోంది. అయితే త్వరలోనే దొరబాబు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Qatar Court: 8 మంది భారత నేవీ మాజీ అధికారుల ఉరిశిక్ష వ్యవహారం.. మరణశిక్షను జైలుశిక్షగా తగ్గింపు!