తెలంగాణలో రైతు సంఘర్షణ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని వరంగల్‌లో ఈ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో ఏడు గంటల కరెంట్ ఇచ్చారని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి మరీ లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు…
Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Fired on Telangana BJP Chief Bandi Sanjay. ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వడా అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…
బండి సంజయ్ నీ మిలియన్ మార్చ్ మోడీ దగ్గర చేయి మాదగ్గర కాదు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాటల దాడికి దిగారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో…
దమ్ముంటే కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. మా దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ విసిరార్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు. బీజేపీ పాలితరాష్ట్రల్లో రైతుబంధు ఉందా ? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలు.. ఆంధ్రాలో డమాల్ అంటూ వ్యాఖ్యానించారు.…
అమెరికా వంటి దేశాలలో మన తెలుగు వారు చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదంటే అతిశయోక్తి లేదు. అమెరికాకు భారతీయురాలు ఉపాధ్యక్షురాలు కావడం అంటే మన దేశం ప్రజల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాతృ దేశానికి సేవలు చేస్తున్నారు. ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎక్కడ ఏం సంపాదించినా చివరకు మిగిలేది చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే. ప్రజలకు…
కేసీఆర్ లేని తెలంగాణ ను ఊహించుకోలేము. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన నాయకునిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మనం ఎందుకు ఊర్కోవాలి.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. మా రైతు ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ వ్యవసాయ కరెంట్ మోటర్ల కాడ మీటర్లు ఒప్పుకోలే. ప్రభుత్వరంగ సంస్థలన్ని మోడీ సర్కారు…
త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లపై మాట్లాడుతూ… డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జాలు లేవు, రౌడీ షీటర్లు లేరు. లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ రాబోతుంది.సెంట్రల్ ప్రభుత్వం తో మాట్లాడుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. తద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది అని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్(RRR) విషయంలో లాండ్ సేకరణ 50…
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ…
మానవత్వం చాటుకున్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా పర్యటన ముగించుకుని నిజామాబాద్ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఆర్మూర్ క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.. వెంటనే తన కాన్వాయ్ ఆపి.. క్షతగాత్రుల దగ్గరికి వెళ్లి పరామర్శించిన మంత్రి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గాయపడినవారిలో చిన్న పాప ఉండడం చూసి చలించిపోయారు. వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తన కాన్వాయ్‌లోని…