మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది.…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
Vemula Prashanth Reddy : ఇవాళ ఈ రాష్ట్రంలో ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవనలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకొన్నడని, మీరు పెట్టిన సర్వేలోనే KCR కు 70% నీకు 30% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డి మైండ్…
Vemula Prashanth Reddy: రేవంత్ ప్రభుత్వం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్క రోజే పెట్టారు..
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు త్వరలో అర్థం అవుతుందన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టమంటారో చెప్పాలన్నారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను వీడుతున్న వాళ్ళంతా స్వార్థ…
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థుడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహణపై ముఖ్యమంత్రి బాంబు పేల్చారని, ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని అన్నారు. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, రైతుబంధు ఎకరాకు రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన…
నోటికివచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బీఆర్‌ఎస్ నేతలపై భట్టి ఫైర్ ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ…
బెల్లంపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన మూడు రోజులకే విదేశీ పర్యటనలు ఉన్న రేవంత్ రెడ్డిని అదానీ భేటీ అయి పెట్టుబడులు పెడతానంటూ సమావేశం ఏర్పాటు చేయడం, వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థపై అదానికి కన్ను పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హామీల అమలుకు కౌంట్ డౌన్ షురూ అయ్యిందని ఆరోపించారు. హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు.. వెంటాడుతాం.. పోరాడుతామని అన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తామని తెలిపారు.