కేసీఆర్ లేని తెలంగాణ ను ఊహించుకోలేము. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన నాయకునిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మనం ఎందుకు ఊర్కోవాలి.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. మా రైతు ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ వ్యవసాయ కరెంట్ మోటర్ల కాడ మీటర్లు ఒప్పుకోలే. ప్రభుత్వరంగ సంస్థలన్ని మోడీ సర్కారు అమ్మకానికి పెట్టింది.ఉద్యోగులు రోడ్లమీద పడుతున్నారు. పెన్షన్లు,ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లపై బీజేపీ,కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరు లేరు… ప్రభుత్వమే ఆలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ సుభిక్షం…లేకుంటే మళ్లీ పూర్వపు రోజులే అని పేర్కొన్నారు.