ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్…