Vemula Prashanth Reddy : ఏనుముల రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు..!
- ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు సీఎం కావడం ప్రజల దురదృష్టం
- మీరు పెట్టిన సర్వేతో మీ మైండ్ బ్లాక్ అయ్యింది. రుణమాఫీ నేను రాగానే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నదేవరు? - వేముల ప్రశాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy : ఇవాళ ఈ రాష్ట్రంలో ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవనలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకొన్నడని, మీరు పెట్టిన సర్వేలోనే KCR కు 70% నీకు 30% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. నిన్న షాద్ నగర్ మీటింగ్‌లో ఫ్రస్టేషన్ తో ఊగి పోతూ ఎప్పటిలాగే ఆ కంపునోరుతో అవే అబద్దాలు అవే సంస్కారం లేని మాటలు అదే బూతులు మాట్లాడిండని ఆయన మండిపడ్డారు. అందుకే నిన్న ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి గా కాకుండా బూతుల రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన విమర్శించారు.
PM Modi: ఇది ప్రజల బడ్జెట్.. పొదుపు, పెట్టుబడుల్ని పెంచుతుంది..
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
నేను మాట తప్పే, మడమ తిప్పే రకం కాదు అన్నవు రేవంత్ రెడ్డి… మరి రుణమాఫీ నేను రాగానే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నదేవడు ? తర్వాత తెలంగాణ లో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15 లోపు చేస్తా అన్నదెవరు? తర్వాత మళ్ళీ దసరా లోపు అన్నదెవరు? రేవంత్ రెడ్డి పూర్తీ అయ్యిందా? రుణమాఫీ నేటికి 4 విడుతలుగా వేసినా కూడా మీ లెక్కల ప్రకారం ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మా లెక్కల ప్రకారం ఇంకా 30 లక్షల మందికి కాలేదు. ఇది మాట తప్పుడు కాదా ? అని రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. అందుకే నిన్ను ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి అంటున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
అంతేకాకుండా..’నీ నోటితోనే అన్నవు కేసీఆర్ రెండు పర్యాయాలు కలిపి 29000 కోట్ల రుణ మాఫీ చేసిండు అని మీరే ఒప్పుకున్నారు.. మేము 21000 కోట్లు చేసినం అని కూడా మీరే చెప్పుకున్నరు. మీకంటే కేసీఆర్ 8000 కోట్లు ఎక్కువ చేసినట్టే కదా ! మరి నిన్నేం మాట్లాడినావు ? అది నోరా ? మోరా ? రేవంత్ రెడ్డి. రైతుబందులో. . .ఇప్పుడు తీసుకుంటే 10,000 Dec 9 నాడు నేను రాగానే తీసుకుంటే 15000 అన్నదేవడు ? ఇచ్చినావ 15000 చెప్పు రేవంత్ రెడ్డి.
అదీ మేము డబ్బులు రెడీ చేసి 2 రోజుల్లో ఇస్తామని మా హరీష్ రావు పాలకుర్తి సభలో చెప్పగానే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి మేమివ్వబోయే రైతు బంధు ను ఆపి… నువ్వు రాగానే అవే డబ్బులతో పాత 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నదెవరు? తర్వాత వానాకాలం పంటకు ఎగ్గొట్టి, తర్వాత యాసంగి పంటకు సంక్రాంతి కి ఇస్తానన్నదెవరు ?ఇచ్చినావ రేవంత్ రెడ్డి ? తర్వాత మాట మార్చి జనవరి 26 న టిక్…టిక్ అన్నదెవరు? వినిపించిందా టిక్ టిక్ ? ఇప్పుడు మళ్లీ 31 అంటున్నదెవరు ?ఇది మాట తప్పుడు కాదా ? అనడుగుతున్న రేవంత్ రెడ్డిని.’ అని వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!