KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. ఢీకొన్న రెండో కారుకూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Read Also: CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. శాఖల మార్పులపై కీలక చర్చలు..?
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రమాద స్థలానికి సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రించారు. వాహనాలను పక్కకు తప్పించి రూటును క్లియర్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా కొద్ది సేపు కాన్వాయ్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చి కాన్వాయ్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Read Also: KTR: కేసీఆర్ జీవితం ఓ చరిత్ర.. తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడు..!