పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో…
ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని.. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని… ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…