దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం.
Read Also: వైసీపీ కౌంటర్ ఎటాక్… ఏపీలో బీజేపీ తీరుపై పత్రికల్లో ప్రకటనలు
మరోవైపు పెట్రోల్ ధర విషయంలో దేశవ్యాప్తంగా రాజస్థాన్ తొలిస్థానంలో ఉంది. రాజస్థాన్‌లో లీటరు పెట్రోల్ ధర 111.30గా నమోదైంది. ఏపీలో మాత్రం పెట్రోల్ ధర రూ.110.15గా ఉంది. రాజస్థాన్‌లో లీటర్ డీజిల్ ధర రూ.95.71గా ఉంది. ఏపీలో డీజిల్‌పై 22.25% వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సెస్ కింద రూ.1(దీనిపై వ్యాట్ అదనం) చొప్పున పన్ను వేస్తున్నారు. రాజస్థాన్‌లో 26% వ్యాట్ ట్యాక్స్‌తో పాటు రూ.1.75 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ విధిస్తున్నారు.