Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Pawan Kalyan Over Volunteers Issue: విజయవాడలోని సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్.. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ముద్రగడ భార్య, కోడలి విషయంలో తలెత్తిన ఇబ్బందులుపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. గంజాయి మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో భూ దోపిడీ, గంజాయి మీద టీడీపీ హయాంలో అప్పటి మంత్రులు అయ్యన్న, గంటాలు చెప్పినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నాడని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గీతం సంస్థ అధీనంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు ఉంటే.. పవన్ ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. నూటికి 95శాతం పథకాలు మహిళలకు ఇస్తుంటే.. దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసమంటే.. పవన్ మహిళల్ని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పవన్, చంద్రబాబు తేల్చుకోవాలే తప్ప.. ఎవరిని సీఎం చేయాలో నిర్ణయించేది జనమని ఉద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ ఓ బాబా అని.. బాబా అంటే బాబుగారి బానిస అని వర్ణించారు.
Gudivada Amarnath: సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ కళ్యాణ్ విధానం
రాష్ట్ర విభజన కోసం ముందుగా లేఖ ఇచ్చింది టీడీపీనే అని అమర్నాథ్ తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబులు కొండలు కొట్టకుండానే.. తమ ఇళ్లను నిర్మించుకున్నారా? అని నిలదీశారు. రాజధాని విశాఖపట్నం అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాకుండా ఏం చేస్తాడు? అని అడిగారు. రాజకీయ పార్టీలో ఉండాలనుకునే వాళ్లు రాజధానిలోనే నివాసం ఉండాలని.. అందుకు తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టన్స్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఒక్క సెమిస్టర్ పాస్ అయితే.. పవన్ కళ్యాణ్‌కు విలువ తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!