Pawan Kalyan: మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభించిన ఆయన.. ఈ రోజు పెడనలో మాట్లాడుతూ.. ఏడాదిగా మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నాం. మనం ఇక్కడకు రావాలంటే పాస్ పోర్టు, వీసా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు.. బలమైన పోరాటాలు చేస్తున్నారు జనసైనికులు.. కొట్టిన వారిని మేం మర్చిపోం.. పెడనలో అంబేడ్కర్ విగ్రహానికి కట్టేసి, జనసైనికులను కొట్టారు. దానిని మర్చిపోం. అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారట.. ప్రజా ప్రతినిధులు ప్రజలు వస్తే లేచి నిలబడే సంస్కృతి, వినాశ కాలే విపరీత బుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరకి రప్పించుకోవడానికే ఓట్లు వేయించుకోడానికి రూపాయి పావలా.. ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని సెటైర్లు వేశారు. మనందరం ఆంధ్రులం.. మనది ఒకటే గుండె చప్పుడు.. విబేధాలు పాలసీల వరకే ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నేను గతంలో టీడీపీకి మద్దతిచ్చాం.. అనుకున్నది జరగలేదు.. జరిగిందేదో జరిగింది.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.
ప్రజా ప్రతినిధి ఉండే ఏరియాలో జనసైనికులు వెళ్ళకూడదంట.. ఇదేంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పవన్.. రాబోయే ఎన్నికల తరువాత తీసేద్ధాం. వైసీపీ నవరత్నాలు చెప్పిందొకటి, చేసేదొకటి. జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం. జనాన్ని తమ దగ్గరకు రప్పించుకోవడానికే వైసీపీ నేతలు రూపాయి పావలా సిద్ధాంతం వాడుతున్నారు. ఓట్లు వేయించుకోవడానికే వైసీపీ పథకాలు. అమల్లోకి వచ్చేసరికి పథకాల్లో అంతా డొల్లతనమే. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే అక్రమ కేసులు పెడతున్నారని ఆరోపణలు గుప్పించారు.. క్లాస్ వార్ అని పలికే వాడు కూలీల పొట్ట కొట్టాడు.. జాతీయ ఉపాధి హామీ పధకం కింద 337 కోట్లు దారి మళ్ళించారు.. టీడీపీ నాయకుల మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టారు.. దేశద్రోహం కేసులు అత్యధికంగా ఏపీలో నమోదయ్యాయని దుయ్యబట్టారు. ఏమైనా అంటే కేసులు పెడతారేమో.. కేసులకు భయపడే వాడు రాజకీయాల్లోకి ఎందుకొస్తాడు? అని ప్రశ్నించారు.
మడ అడవులు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌ను ఆక్రమించి రొయ్యల చెరువులు తవ్వేశారు అని ఆరోపించారు పవన్.. 28 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉండగా కేవలం 3 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. ఇళ్ల నిర్మాణనికీ నిధుల కేటాయింపులోనూ దగా చేశారు. క్లాస్ వార్ అని చెగువేరా లాగా జగన్ మాట్లాడతాడు. జగనన్న భవిష్యత్తు కాదు.. అది విపత్తు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఫ్లెక్సీలు తయారీ చేసే యువత ఉపాధిని దెబ్బతీశారు అని మండిపడ్డారు. మన రాష్ట్రంలోమనకు కుల భావన ఎక్కువ.. జాతి భావన తక్కువ. తెలంగాణాలో కులాలు ఉన్నాయి.. కానీ తెలంగాణా భావన ఎక్కువ. మన రాష్ట్ర ప్రజలు ఎవరి దగ్గర దేహీ అనే పరిస్థితి ఉండకూడదనే, జనసేన ప్రారంభించాను అని తెలిపారు.. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం కలిసికట్టుగా పోరాటం చేయలేక పోయాం. ఏపీకి సరైన రాజధాని కూడా లేని పరిస్థితి. మన మాజీ సీఎం చంద్రబాబును సీఎం జగన్ జైలులో పెట్టించాడు ఇక, రేపు వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నాడు. ఏం ప్రయోజనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.