Mumbai-Bound Vande Bharat Train Hits Cattle: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోెని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.
Vande Bharat Express: ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధం అవుతుంది. నవంబర్ 10న ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తే అవన్ని ఉత్తర భారత దేశంలోనే పలు రూట్లలో నడుస్తున్నాయి. తాజాగా ఈ ఐదో వందే భారత్ రైలును దక్షిణాదిలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు. నవంబర్ నెలలో చెన్నై-బెంగళూర్-మైసూర్ మార్గంలో ఈ రైలును ప్రారంభించనున్నారు.
PM Narendra Modi might inaugurate fourth Vande Bharat train: గురువారం రోజున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది. బుధవారం మినహా అన్ని రోజులు ఈ రైలు…
Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
Vande Bharat 2 Train start on sep 30: దేశంలో రైల్వేలను మరింత ఆధునీకీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైళ్లలో సౌకర్యాలతో పాటు ప్రజల కంఫర్ట్ ప్రధానంగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత స్పీడుగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. తాజాగా వందే భారత్ 2(వీబీ2) రైళ్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ హై స్పీడు రైలు 20 రోజుల ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రైల్వే సేఫ్టీ కమిషనర్( సీఆర్ఎస్)…