Today (13-02-23) Business Headlines: మనోళ్లే మార్కెట్ ఓనర్లు: ఇండియన్ ఈక్విటీ మార్కెట్’లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్’లో లైఫ్ టైమ్ హయ్యస్ట్ లెవల్’కి చేరుకుంది. అంటే.. 24 పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది. వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా గ్రోత్ నెలకొనటం విశేషం. ఈ యాజమాన్యం.. వ్యక్తులు మరియు సంస్థలది కావటం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా.. రిటైల్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్ మాత్రం సున్నా పాయింట్ ఒకటీ ఒకటీ శాతం తగ్గింది.
Vande Bharat trains: దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేకు ఆధునిక హంగులు తీసుకురావడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
Vande Bharat: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. మొన్న ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు.
Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్…
Attack on Vande Bharat Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేశారు.. అయితే, ఇండియన్ రైల్వేస్ 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది..…