Vande Bharat Express: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బంగాల్‌లోని హౌరా-న్యూ జల్‌పైగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు హౌరా, న్యూ జల్‌పైగురిని కలుపుతుంది. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని కర్తవ్యాన్ని ప్రధాని మోదీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. బంగాల్‌లో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
బ్లూ అండ్ వైట్ రైలు 7.45 గంటల్లో 564 కి.మీల దూరాన్ని చేరుతుంది. ఈ మార్గంలో ఇతర రైళ్లతో పోలిస్తే మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇది బార్సోయ్, మాల్దా, బోల్పూర్‌లలో మూడు స్టాపేజ్‌లను కలిగి ఉంటుంది. ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సాధారణ ప్రయాణికులు, టీ పరిశ్రమ అధికారులు, ఉత్తర బెంగాల్, సిక్కింలోని హిమాలయాలకు ప్రయాణించే పర్యాటకులు ఇష్టపడతారు. అత్యాధునిక రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి, ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.
PM Modi flags off Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, in West Bengal, via video conferencing. West Bengal CM Mamata Banerjee, Union railway minister Ashwini Vaishnaw & other leaders present at the event in Howrah. pic.twitter.com/YFuoltdslX
— ANI (@ANI) December 30, 2022
అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు హీరాబెన్ మోదీ కన్నుమూశారు. బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు నిర్వహించారు. హీరాబెన్ మోదీ అంత్యక్రియలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రూపానీ, గుజరాత్ కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈ ఉదయం గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా తన తల్లికి రేసన్ నివాసంలో నివాళులర్పించారు, అనంతరం ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
World leaders offer condolences: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రపంచ నేతల సంతాపం
ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.