Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు..
Read Also: Posani Krishna Murali Case: థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? పోసానిని ప్రశ్నించిన జడ్జి
కాగా, కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్‌పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.. విజయవాడ సబ్‌జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని.. గన్నవరం తరలించిన ఆత్కూరు పోలీసులు.. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపరిచారు.. అయితే, ఆత్కూరు పీఎస్‌లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు.. అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకు వంశీని తరలించారు పోలీసులు.. ఇప్పటికే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీకి.. తాజా రిమాండ్‌తో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. అంటే.. రిమాండ్‌లో ఉండగానే.. మరో రిమాండ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది..