భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్‌లో భారత్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19 వ్యాక్సిన్ మొదటి డోస్‌గా పొందారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాలు సానుకూలత వ్యక్తం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఈ సర్వే ప్రకారం.. వ్యాక్సిన్ వేయించుకుని 9 కోట్ల మందిలో 7.5 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రక్షణ పొందాలని చూస్తున్నవారేనని తేలింది. కేవలం1.5 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని గుర్తించింది.
అయితే టీకా వేయించుకోవడానికి నిరాకరిస్తున్న వారు కూడా పూర్తిగా కఠినంగా లేరని తెలిపింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతిరోజు సగటున 60నుంచి 70 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఈ నెలఖారు వరకు దేశ వయోజన జనాభా మొత్తానికి ఫస్ట్ డోస్ టీకాలు పూర్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌తో పోలిస్తే ఐరోపా దేశాలు, యూఎస్‌లో వ్యాక్సినేషన్‌పై సందేహాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.