సౌతాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. దీంతో.. కొత్త వేరియంట్‌పై కూడా రకరకాల పరిశోధనలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్‌పై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంత? అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు.. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది.. కరోనా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఒమిక్రాన్ తగ్గిస్తుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో.. ఇక, ఒమిక్రాన్‌కు డెల్టా కంటే వేగంగా వ్యాప్తించే గుణం ఉందని స్పష్టం చేసింది.. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఒమిక్రాన్ కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరితే డెల్టా వేరియంట్ కేసులను మించిపోవచ్చని అంచనా వేసింది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నట్టు ప్రాథమిక సమాచారంలో తేలినట్టు తెలిపిన డబ్ల్యూహెచ్‌వో.. కానీ, లక్షణాలపై ఇప్పుడే నిర్ధాణకు రావొద్దని, కొత్త వేరియంట్‌పై మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొంది.
Read Also: ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు..
ఇక, కరోనా కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి ఆయా దేశాలు.. మెజార్టీగా రెండు డోసుల టీకాలు అందుబాటులో ఉండగా.. సింగిల్ డోసు టీకాలు కూడా లేకపోలేదు.. అయితే, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి రక్షణకు బూస్టర్ డోసు చాలా సులభమైన మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బూస్టర్ డోసుతో శరీరంలో యాంటిబాడీలు పెరుగుతాయని, తద్వారా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా వ్యాధి నిరోధకత తక్కువ ఉన్న వారికి బూస్టర్ డోస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా టీకా బూస్టర్ డోసు ఒమిక్రాన్ నుంచి 70-75 శాతం రక్షణనిస్తున్నదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించిన నేపథ్యంలో.. వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. బూస్టర్ డోసు వేసుకుంటే శరీరంలో యాంటిబాడీలు గణనీయంగా పెరుగుతాయని చెబుతున్నారు.