కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిపోయింది.. దీంతో, క్రమంగా అన్ని ఏజ్ గ్రూపులకు వ్యాక్సిన్ వేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే కాగా.. త్వరలోనే 15 ఏళ్ల లోపు వారికి కూడా టీకాలు వేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇవాళ వ్యాక్సినేషన్‌పై మాట్లాడిన జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా… త్వరలోనే 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయనున్నట్టు వెల్లడించారు.. ఎందుకంటే 15 – 18 ఏజ్ గ్రూప్‌కు మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని.. ఆ తర్వాత 15 ఏళ్లకు లోపు వారికి టీకాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని.. త్వరలోనే విధివిధానాలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానున్నట్టు వెల్లడించారు.
Read Also: విద్యా విధానంపై తెలంగాణలో కొత్త చట్టం..!
దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల వయస్సు గలవారు 7.4 కోట్ల మంది వరకు ఉండా.. అందులో ఇప్పటివరకు 3.45 కోట్ల మందికి పైగా కోవాక్సిన్ మొదటి డోస్ పొందారని, వారి రెండవ డోస్ 28 రోజుల్లో ఇవ్వబడుతుందని.. ఇక, 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది వరకు ఉంటారని తెలిపారు అరోరా.. మరోవైపు ఈరోజు వ్యాక్సినేషన్ నివేదికల ప్రకారం.. గత 24 గంటల్లో 39 లక్షలకు పైగా డోస్‌లు అందించబడ్డాయి, దీనితో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 157.2 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించబడింది, మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఇవ్వగా.. ఫ్రంట్‌లైన్ కార్మికుల టీకా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది.. టీకా తదుపరి దశ గత ఏడాది మార్చి 1న 60 ఏళ్లు పైబడిన వారికి మరియు 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రారంభించబడింది.. దేశం ఏప్రిల్ 1, 2021 నుండి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ను ఇవ్వడం మొదలుపెట్టగా.. మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి అనుమతించబడిన విషయం తెలిసిందే.