గత రెండేళ్లుగా దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ, చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెంట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నాయి. మందుబాబులు వ్యాక్సిన్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోకుండా మద్యం షాపుల వద్దకు వస్తుండటంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Read: వెరైటీ ఆలోచన: జాబ్ కోసం ఇలా కరపత్రాలను పంచి… టాప్ కంపెనీలో….
రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారికే మద్యం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వమే రన్ చేస్తున్నది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపితేనే మద్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో మందుబాబులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో మందుబాబులు వ్యాక్సినేషన్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకొని సర్టిఫికెట్ తెచ్చుకొని మందు కొనుగోలు చేస్తున్నారు.