ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో కోవిఢ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక సూచలను చేశారు మన్సుఖ్ మాండవియా..
Read Also: సీఎంకు షాక్.. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి సీఎం సోదరుడు..!
కరోనా కట్టడి కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రశంసించిన ఆరోగ్య మంత్రి.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు వేయడం మరియు కోవిడ్‌కు వ్యతిరేకంగా తగిన నియమాలకు కట్టుబడి ఉండటం వంటి ఐదు దశల వ్యూహంపై అందరూ దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.. పరస్పర అవగాహన, ఉత్తమ అనుభవానలు పంచుకోవడం మరియు సహకార స్ఫూర్తి.. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో మాకు సహాయపడిందన్నారు డాక్టర్ మన్సుఖ్ మాండవియా.. ఇక, భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ గ్లోబల్ సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు.. ముఖ్యంగా మనలాంటి జనాభా కలిగిన దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు.