2020 డిసెంబర్ నుంచి ప్రపంచంలో కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలిటీకాలను బ్రిటన్‌లో వేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించారు. తొలి టీకా వేయించుకున్న తొలి మహిళగా 91 ఏళ్ల మార్గరేట్ కీనన్ చరిత్ర సృష్టించగా, తొలి పురుషుడిగా 81ఏళ్ల విలియం షెక్స్ పియర్ చరిత్ర సృష్టించారు. అయితే, తొలి టీకా వేసుకున్న విలియం అనారోగ్యంతో మృతి చెందారు. టీకాకు విలియం మృతికి సంబందం లేదని, ఇతర అనారోగ్య సమస్యల వలన ఆయన…
కరోనా మహమ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో జనవరి 16 వ తేదీ నుంచి టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళవారానికి 130 రోజులు ఆయింది. 130 రోజుల వ్వవధిలో 20 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు. 15,69,99,310 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు…
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడేందుకు టీకాలను అందిస్తున్నారు. అయితే, టీకా తీసుకోవడానికి ప్రజలు వెనకాడుతున్నారు. టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయిని, టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. అమెరికా నుంచి ఇండియా వరకు ప్రజల్లో ఇదేవిధమైన భయాలు ఉన్నాయి. ప్రజలను ఎంకరేజ్ చేసేందుకు ఎక్కడికక్కడ తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో ఈ తాయిలాలు అధికం. ఇండియాలో కూడా…
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా…
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నాక అనేక దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిబందనలు పాటించకపోవడంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ సీషెల్స్. 98 వేల మంది జనాభా కలిగిన ఈ దేశంలో 61.4 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందించారు.…
కరోనా కట్టడి చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని,…
వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు… కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో.. వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ నిలిపివేసింది సర్కార్.. టీకాలు వేయడం నిలిచిపోయి కూడా పది రోజులు గడిచింది… అయినా.. తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు.. కానీ, ఇవాళ ఆ తేదీని ఫైనల్ చేసే అవకాశంఉంది… మొదటగా ఫ్రంట్ లైన్…
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలి అంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో, తీసుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం ఆరగంటసేపు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వలన ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. వ్యాక్సినేషన్‌కు ముందు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వ్యాక్సినేషన్ వలన సైడ్ ఎఫెక్టులు ఎక్కువకాలం ఉంటాయి కాబట్టి ఎలాంటి…