తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ స్పైడర్స్‌కి వ్యాక్సిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు, మద్యం అమ్మకాల వారికి టీకా ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. వీరు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. మొదటగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటోడ్రైవర్లుకు వేయాలని నిర్ణయానికి వచ్చారు. 18-44 ఏళ్ల వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న 4.90 లక్షల డోసులను సూపర్ స్పైడర్స్‌కి ఇచ్చేందుకు ఉపయోగించనున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి హరీష్‌రావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. సూపర్ స్పైడర్లకు టీకాలు వేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!