కరోనా మహమ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో జనవరి 16 వ తేదీ నుంచి టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళవారానికి 130 రోజులు ఆయింది. 130 రోజుల వ్వవధిలో 20 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు. 15,69,99,310 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో ఎక్కవ మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్రం సూచించింది.