కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలి అంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో, తీసుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం ఆరగంటసేపు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వలన ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. వ్యాక్సినేషన్‌కు ముందు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వ్యాక్సినేషన్ వలన సైడ్ ఎఫెక్టులు ఎక్కువకాలం ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం పనికిరాదు. ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం మొదటి, రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. వ్యాక్సినేషన్ సమయంతో ఇచ్చే కార్డును పారేయకండి. ఈ కార్డు ప్రకారం సెకండ్ డోస్ ఇస్తారు. అంతేకాదు, సెకండ్ డోస్ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావొద్దు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి చిన్న ఇబ్బందులు తలెత్తినా నిర్ణక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.