దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటుండగా, మరోవైపు వ్యాక్సిన్ ఎక్కువగా వృధా అవుతున్నది. వ్యాక్సిన్ వృధా ఒక్కశాతం కంటే తక్కువ ఉండేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ పదేపదే రాష్ట్రాలను హెచ్చరిస్తున్నా, వృధా ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌లో 37.3 శాతం, చత్తీస్ గడ్‌లో 30.2 శాతం వృధా చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే, తమిళనాడులో 15.5శాతం, జమ్ముకాశ్మీర్‌లో 10.8శాతం, మధ్యప్రదేశ్‌లో 10.7శాతం టీకాలు వృధా అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం వరకు మొత్తం 22కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. రాష్ట్రాల వద్ద ఇంకా 1.77 కోట్ల వ్యాక్సిన్‌లు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలియజేసింది.