కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో లాక్‌డౌన్ ను ఎత్తివేయాలని రాష్ట్రాలు చూస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికోసం మూడు అంశాల ప్రణాళికను వెల్లడించింది. తక్కువ పాజిటివిటి రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తనల వంటి అంశాలను…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యక్సిన్ లు రెండు డోసులు వేయాలి. మొదటి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వలన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతున్నది. దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ఇప్పటికే…
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు…
నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ…
కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లమందికి వ్యాక్సిన్ అందించారు. మే నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసులను అందుబాటులో ఉంచగా, జూన్ నెలలో 12కోట్ల డోసులను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనుండగా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించేందుకు…
మాస్కులతో నోళ్లు మూస్కోవటం జనాలకి జీవితంలో భాగమైపోయింది. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, అమెరికాలో కొన్ని మల్టీ ప్లెక్సులు మాత్రం ‘మాస్క్ అక్కర్లేదు’ అంటున్నాయి! అయితే, ఇది అందరికీ వర్తించే రూల్ కాదు. అలాగే, అన్ని చోట్లా కూడా కాదు. పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియని పూర్తి చేసిన ఆడియన్స్ తమ సినిమా హాళ్లలో మాస్క్ తీసేయవచ్చని యూఎస్ లోని మేజర్ సినిమా చైన్స్ తాజాగా ప్రకటించాయి. అయితే, ఇదంతా అన్ని చోట్లా వర్తించే నియమం కాదు.…
కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను అనుమతి ఇచ్చిన సర్కార్.. మరోవైపు కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్…
యూరప్ ఖండం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూరప్ ఖండంలో వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంవత్సరం చాలా వరకు దెబ్బతిన్నది. ఆగస్టు నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 7 వ తేదీ నుంచి 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైజర్ లేదా బయో ఎన్‌టెక్ కరోనా టీకాలు ఇవ్వడానికి యూరోపియన్…
తమిళనాడులో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు దేశం మొత్తంమీద 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం విశేషం. ఇక తమిళనాడులో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు పైగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచితంగా టీకా వేస్తామని హామీ ఇచ్చింది డిఎంకే. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నది.…
కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ ను రష్యా తయారు చేసిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ కరోనాకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకుతున్నది. దీంతో రష్యా జంతువుల కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కార్నివాక్ కోవ్ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. జంతువులకు కార్నివాక్‌కోవ్ వ్యాక్సిన్‌ను జంతువులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో…