వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు…
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలిపారు. ‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనలో తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు…
వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు కేవలం దేశంలో 4 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారని, ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణలోని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, 7 వతేదీన గాంధీభవన్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంత వరకు…
వ్యాక్సిన్ల కోసం స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగడం చర్చగా మారింది.. అసలే వ్యాక్సిన్ల కొరత ఉండడంతో.. ఓ క్రమ పద్దతి ప్రకారం వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది సర్కార్.. అయితే, ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దౌర్జన్యానికి దిగారు.. సూపర్ స్పైడర్స్ కు ఇవ్వాల్సిన టోకెన్‌లు తమ అనుచరుల కుటుంబసభ్యులకు ఇవ్వాలని వీరంగం సృష్టించారు.. దీంతో.. నిజమైన సూపర్ స్పైడర్స్ కు అన్యాయం జరుగుతుందంటూ వాక్సిన్ వేసేందుకు నిరాకరించారు వైద్యులు..…
వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. High exposure గ్రూపులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీచేశారు.…
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లతో పాటుగా విదేశీ వ్యాక్సిన్లకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చే ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫైజర్, మోడెర్నా టీకాలు కూడా ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ టీకాలు నష్టపరిహారంపై రక్షణ కోరుతున్నాయి. ఇలాంటి రక్షణ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడంతో సీరం సంస్థకూడా తమకు ఇలాంటి రక్షణ ఇవ్వాలని కోరుతున్నది. టీకా తీసుకున్న వ్యక్తి దుష్ప్రభావాలకు గురైనపుడు టీకా సంస్థలు నష్టపరిహారం…
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ పై ఉన్న అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే వికటించి మరణిస్తారని అపోహలతో ముందుకు రావడంలేదు. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండటంతో ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ కలెక్టర్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. టీకాలు తీసుకున్న వారికే జీతాలు చెల్లిస్తామని కలెక్టర్…
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ…
కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదు కావడంతో.. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్లాయి.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ లాంటి నిర్ణయాలు తీసుకుని కఠినంగా అమలు చేస్తున్నాయి.. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను స్వస్తి చెప్పి.. అక్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్‌లోకి వెళ్లిపోతున్నాయి.. అయితే, అన్‌లాక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.. అన్‌లాక్‌కు వెళ్లే సమయంలో.. రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం…