ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా పంపిణి వేగవంతంగా జరుగుతున్నది. కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట అధికంగా ఉండటంతో ఈరోజు రేపు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. టీకా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ఓటర్లకు అందించేందుకు…
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్లు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ల పై అనేక మందికి అనేక అపోహలు ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరిగింది. సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ పై ఓ బామ్మ అవగాహన కల్పిస్తూ…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి శంకర నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, కరోనా భయంతో బయటకు రాకుండా ఉన్నారని అన్నారు. 14 సంవత్సరాల్లో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యాక్సినేషన్ కోసం చర్యలు తీసుకుంటోందని, చంద్రబాబు వ్యాక్సిన్ గురించి మోడీని…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను పెద్దలందరికి అందించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 88 లక్షల టీకాలు ఉన్నాయిని, మరో మూడు రోజుల్లో 28 లక్షల టీకాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మే 1 వ తేదీ నుంచి దేశంలో…
ప్రపంచంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ దేశాలు మహమ్మారి భయం నుంచి ఇంకా కోలుకోలేదు. గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ క్రమంగా విజృంభిస్తోంది. దీంతో అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. గల్ఫ్ ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఇండియా విమానాలపై రెండు వారాలు బ్యాన్ విధించింది. ఇక దేశీయ పౌరులపై కూడా ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించింది. దేశీయంగా టీకాలు వేయించుకొని పౌరులపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. టీకాలు వేసుకోని…
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఆళ్ల నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 3120 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరోనా సెకండ్ వేవ్ ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్న మంత్రి.. 104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా సీఎం…
మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే, చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండడంతో.. ఇప్పుడే మా వళ్ల కాదంటూ చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి.. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాగా, పెద్ద సంఖ్యలో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకునే పనిలో పడిపోయారు.. వారి తాకిడికి సర్వర్లే మోరాయించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పట్లో సాధ్యం…
కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసే సామర్థ్యం మన యంత్రాంగానికి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.. రికవరీలో జాతీయ సగటు 88.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 93.50 శాతం ఉందని.. విమర్శించే వాళ్లు దీనిని ఎందుకు చెప్పడం…
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది.. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వడం లేదు.. ఇక, కోవిడ్ వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కీలక వ్యాఖ్యలు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా…
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. మే 1 తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని… ఏపీలో 2 కోట్ల 4 లక్షల మంది 18-45 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టీకాల కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని..ఉత్పత్తిలో సగం కేంద్రానికి ఇవ్వాలి ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి…