ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు..
డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల నష్టం కలుగుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి లేఖ రాయడం సంతోషం అన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీలిమిటేషన్‌పై పార్లమెంటులో మాట్లాడాలనడం గోడ మీద పిల్లి వాటం అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీని కాదనలేక సర్కస్ ఫీట్లు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్).. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు వి. శ్రీనివాసరావు.. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇక, 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు. దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన నారా లోకేష్.. నేడు వాటిని బిగించాలని చెప్పటం సిగ్గుచేటని శ్రీనివాస రావు మండిపడ్డారు.
కరెంటు బిల్లుల పెంపుతో కూటమి ప్రభుత్వం ప్రజల గూబలు గుయ్యమనిపించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్) ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కరెంటు బిల్లుల పెంపును ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అవుతోందన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాన్ని, స్మార్ట్ మీటర్లుని రద్దు చేసుకోవాలి.. ఆంధ్రప్రదేశ్‌ను అధానాంద్రప్రదేశ్‌గా మార్చొద్దని వీఎస్సార్ కోరారు. వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… కరెంటు బిల్లుల పెంపుతో…
స్టీల్ ప్లాంట్‌న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే…
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.