కరెంటు బిల్లుల పెంపుతో కూటమి ప్రభుత్వం ప్రజల గూబలు గుయ్యమనిపించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్) ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కరెంటు బిల్లుల పెంపును ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అవుతోందన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాన్ని, స్మార్ట్ మీటర్లుని రద్దు చేసుకోవాలి.. ఆంధ్రప్రదేశ్‌ను అధానాంద్రప్రదేశ్‌గా మార్చొద్దని వీఎస్సార్ కోరారు.
వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… కరెంటు బిల్లుల పెంపుతో కూటమి ప్రభుత్వం ప్రజల గూబలు గుయ్యమనిపించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కరెంటు బిల్లుల పెంపును ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. స్మార్ట్ మీటర్లు వద్దన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. అదానీతో విద్యుత్ ఒప్పందాన్ని, స్మార్ట్ మీటర్లునీ రద్దు చేసుకోవాలి. వెంటనే పెంచిన కరెంటు బిల్లులను రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ను అధానాంద్రప్రదేశ్‌గా మార్చొద్దు. ఎన్నికల ముందు పోర్ట్ లో దొరికినవి డ్రగ్స్ అని చెప్పి.. ఇప్పుడేమో కాదు అంటున్నారు. తెర వెనుక కథని ప్రధాని నరేంద్ర మోడీ నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చోద్దు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్, అక్రమ బియ్యం స్మగ్లింగ్ రాష్ట్రంగా మారుస్తున్నారు’ అని మండిపడ్డారు.