ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. ఇప్పటి వరకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పి. మధు కొనసాగగా.. ఇవాళ కొత్త కార్యదర్శిగా వి. శ్రీనివాసరావును ఎన్నుకున్నారు మహాసభలకు హాజరైన ప్రతినిధులు.. ఇకపై మధు స్థానంలో కార్యదర్శిగా శ్రీనివాసరావు కొనసాగనున్నారు.. ఇక, కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శి వర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది.. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 13 మందిని ఎంపిక చేశారు.. రాష్ట్ర…