దేశంలోని ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని హత్య చేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపింది. దుండగుడు టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేశారు. అంతేకారు యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్‌కు కూడా మెసేజ్ చేశాడు. త్వరలో సిఎం యోగిని చంపేస్తాను అంటూ సందేశం పంపాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 28న విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అతీక్ అహ్మద్ (60), అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది తీసుకువెళుతుండగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ లో సంచలన సృష్టించిన గ్యాంగ్ స్టర్ అతిత్ అహ్మద్ హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏప్రిల్ 15న గ్యాంగ్స్టర్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన క్రైమ్ సీన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ రోజు పునర్నిర్మించింది.
గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ హత్య అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. యూపీలో ఏ మాఫియా ఎవరినీ బెదిరంచదని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌పై అల్లర్ల రాష్ట్ర కళంకాన్ని తొలగించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Supreme Court: గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన ఇద్దరిని ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ హత్య ఉత్తర్ ప్రదేశ్ తో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ ఎన్కౌంటర్ రాజ్ గా మారిందని సమాజ్ వాదీ…
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గ్యాంగ్ స్టర్, మాఫియాడాన్, మాజీ ఎంపీ అయిన అతీక్ అహ్మద్ ను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ మాఫియాను మట్టిలో కలిపేస్తా’ అని అన్నంత పనిచేశాడని అనుకుంటున్నారు సాధారణ ప్రజానీకం. అయితే ఎలాగూ జీవితఖైదు శిక్ష పడిన వ్యక్తిని, మరో హత్య కేసు ట్రయల్స్ జరుగున్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది…
Uttar pradesh: దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మైనర్లు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో హోంగార్డు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు అడ్రస్ గా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు, ఆయన కుమారుడి ఎన్ కౌంటర్ ఘటన మరువక ముందే మరో దారణం జరిగింది. జలాన్ జిల్లాలో ఈరోజు ఉదయం కళాశాల పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న యువతిని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
సంచలన సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని మరొక జైలుకు తరలించారు. నిందితులు సన్నీ సింగ్, అరుణ్ మౌర్య, లవలేష్ తోవారీ ముగ్గురిని మునుపటి నైనీ జైలు నుండి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు.