Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఆ రాష్ట్ర మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ సోదరులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో గరుడుగట్టిన మరో గ్యాంగ్స్టర్ మీద ఎన్కౌంటర్ జరిగింది. గ్యాంగ్స్టర్ అనిల్ దుజానాను ఆ రాష్ట్ర టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్టుబెట్టారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుజానా గ్రామానికి చెందిన వ్యక్తి అనిల్ దుజానా. నిజానికి అతడి అసలు పేరు అనిల్ నగర్. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూదందా, కిడ్నాప్ వంటి అనేక తీవ్ర నేరాలు లాంటి అనేకం ఉన్నాయి.
Read Also:Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
మొత్తం 62 కేసుల్లో నిందితుడు అతడు, 2012 నుంచి జైల్లో ఉన్నాడు. 2021లో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే పాత కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోవడంతో పాటు.. తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులను బెదిరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అతన్ని పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనిల్ దుజానా హతమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శపథం చేశాను. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ అనంతరం, రాష్ట్ర టాస్క్ఫోర్స్ పోలీసులు చేసిన రెండవ పెద్ద ఎన్కౌంటర్ ఇదే.
Read Also:CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి