Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fashion Designer Muskan Narang Commits Suicide: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని.. ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు రోజు రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడిపిన ఆమె.. ఆ మరుసటి రోజే విగతజీవిగా మారింది. ఉదయం లేచిన తర్వాత తల్లి గదిలోకి వెళ్లి చూడగా.. ముస్కాన్ కనిపించలేదు. బాత్రూంకి వెళ్లిందేమోనని భావించి వెళ్లి చూస్తే.. అక్కడా కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ ఆమె తల్లి.. ఇళ్లంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో.. ఇంటి పైనున్న స్టోర్ రూంకి వెళ్లి చూసింది. అక్కడ ముస్కాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే ముస్కాన్ తల్లి తల్లడిల్లిపోయింది. ఆమెను కిందకు దింపి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. ముస్కాన్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Ponniyin Selvan 2: మొదటి పార్ట్ కన్నా తక్కువే… అయినా ఇండస్ట్రీ హిట్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
కాగా.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ముస్కాన్ తన అధికార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇదే తన చివరి వీడియో అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. ‘‘ఇదే నా చివరి వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నేను నా కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కన్విన్స్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాను కానీ.. వాళ్లే రివర్స్‌లో నన్ను కన్విన్స్ చేసేందుకు చూశారు. నేను తీసుకుంటున్న నిర్ణయంలో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరినీ నిందించకండి’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియోని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముస్కాన్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఏ విషయంలో ముస్కాన్‌ని కన్విన్స్ చేశారు? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ లో దారుణం.. మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!